1. సరియైన ధ్యానం అయిన 'ఆనాపానసతి' రీతిలో ధ్యానం చేయడం; అందరిచేతా 'ఆనాపానసతి' రీతిలోనే ధ్యానాన్ని అభ్యాసం చేయించడం.
2. సరియైన ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం: వాటినే అందరిచేతా చదివించడం.
3. ధ్యానానుభవాలనూ, పుస్తక జ్ఞానాన్నీ విధిగా అందరూ పరస్పరం పంచుకోవడం.
4. వీలయినంత ఎక్కువగా మౌనం పాటించడం.
5. చిన్నప్పటి నుంచే పిల్లలకు ధ్యాన శిక్షణ ఇవ్వడం.
6. విధిగా పౌర్ణమి ధ్యానం చేయడం: అందరిచేతా పౌర్ణమి ధ్యానాన్ని విధిగా చేయించడం.
7. మాంసం తినకపోవడం: దానిని పూర్తిగా వ్యతిరేకించడం.
8. ఆకలి అయినప్పుడే, మరి ఎంతో పరిమితంగానే, ఆహారాన్ని తీసుకోవడం.
9. అల్లోపతి మందులను ఎంత మాత్రం వాడకుండా వుండడం: వాటిని పూర్తిగా వ్యతిరేకించడం.
10. ధ్యాన శిక్షణలో 'డబ్బు ఇచ్చి పుచ్చుకోవడాలు' అన్నది ఎంత మాత్రం లేకపోవడం.
11. ప్రత్యేక వేషధారణ, ప్రత్యేక నామధారణ అన్నవి సుతరామూ లేకపోవడం; వాటిని పూర్తిగా వ్యతిరేకించడం.
12. 'విగ్రహారాధన', 'వ్యక్తిపూజ' లాంటి వ్యర్థమైన కర్మకాండలు చెయ్యకపోవడం: వాటిని సంపూర్ణంగా వ్యతిరేకించడం.
13. వీలయినప్పుడల్లా పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడం.
14. గృహస్థులుగా సంఘంలో వుంటూనే, ఎవరి చిన్న చిన్న పనులను వారు చూసుకుంటూనే, మరి జన్మకు ముఖ్య కారణమైన జీవన్ముక్తిని సాధించటం.
15. 'శిష్యరికం' అనేది ఏ మాత్రం లేకుండా - అంతా 'మాస్టర్స్' గానే విలసిల్లడం.
16. ఎవరి సమస్యలకు వారే, తమ తమ స్వీయ ఆత్మశక్తిని ఉపయోగించి పరిష్కరించుకోవడం.
17. అన్ని గ్రామాలలోనూ, అన్ని పట్టణాలలోనూ విధిగా 'పిరమిడ్ ధ్యాన కేంద్రాల' నూ, 'పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ' లనూ నెలకొల్పడం.
18. పిరమిడ్ మాస్టర్లందరూ తమ తమ ధ్యానానుభవాలను విధిగా గ్రంథరూపం చేసి ప్రచురించడం.